జిల్లా వివరాలు
2022 జనవరి 26వ తేదీ నాటి గెజిట్ నంబర్ 939 ప్రకారం గుంటూరు జిల్లాను మూడు జిల్లాలుగా విభజించారు. అవి గుంటూరు (18 మండలాలు), నరసరావుపేట / పల్నాడు (28 మండలాలు) మరియు బాపట్ల (25 మండలాలు). తెనాలి డివిజన్‌కు చెందిన 12 మండలాలు మరియు ప్రకాశం జిల్లాకు చెందిన 13 మండలాలు బాపట్ల జిల్లాలో విలీనం చేయబడ్డాయి.
సరిహద్దులు:
జిల్లాకు ఉత్తరాన గుంటూరు జిల్లా, పశ్చిమాన పల్నాడు/నరసరావుపేట మరియు ప్రకాశం జిల్లాలు, దక్షిణాన బంగాళాఖాతం, తూర్పున కృష్ణా పశ్చిమ డెల్టా సరిహద్దులుగా ఉన్నాయి.
భూ వినియోగం:
జిల్లా మొత్తం భౌగోళిక విస్తీర్ణం 3,82,884 హెక్టార్లు. ఇందులో అటవీ ప్రాంతం 12,032 హెక్టార్లు. నికర సాగు విస్తీర్ణం 2,36,866 హెక్టార్లు. జిల్లాలో మొత్తం పంటల సాగు విస్తీర్ణం 1,94,882 హెక్టార్లు. సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువసార్లు సాగు చేసిన విస్తీర్ణం 85,729 హెక్టార్లు.